Monday, April 29, 2024
- Advertisement -

మ‌ళ్లీ తెలంగాణ అమ్మాయిగానే

- Advertisement -

ఎంసీఏలో సాయిప‌ల్ల‌వి

తెలంగాణ యాస ఇంత బావుంట‌దా.. అమ్మాయి తిడితే కూడా గింత ముద్దుగా ఉంట‌దా.. అని అంద‌రూ ఫీల‌యిన సినిమా ఫిదా. అందులో భానుమ‌తిగా సాయిప‌ల్ల‌వి చెప్పిన డైలాగ్‌లు అదిరిపోయాయి. బా.. అని తిట్టితే కూడా న‌వ్విన జ‌నాలు ఉన్నారు. అలా తెలంగాణ యాస‌లో న‌టించి మెప్పించిన సాయిప‌ల్లవి మ‌ళ్లీ తెలంగాణ అమ్మాయిగానే క‌నిపించ‌నుంది.

తెలంగాణ బిడ్డగా ఫిదాలో డైలాగ్ డెలివరీని మరిచిపోలేనిది. తెలుగు భాష, తెలంగాణ యాస నేర్చుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు తన రెండో తెలుగు సినిమాలో కూడా తెలంగాణ పిల్లగానే కనిపించనుంది.

న్యాచుర‌ల్ స్టార్ నాని మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) సినిమాలో తెలంగాణ అమ్మాయిగా భానుమ‌తి కనిపించనుంది. సినిమా మొత్తం వరంగల్ నేప‌థ్యంలో తీశార‌ని టాక్‌. ఎందుకంటే ఇటీవ‌ల విడుద‌లైన కొన్ని స‌న్నివేశాల్లో రామ‌ప్ప దేవాల‌యం, ల‌క్న‌వ‌రం స‌ర‌స్సుపై షూటింగ్ చేశారు.

సాయిప‌ల్ల‌వి మాట‌ల‌కు తెలంగాణ యాస పెట్ట‌కున్నా తెలంగాణ ఇతివృత్తంలో కొన‌సాగ‌నుంది. మ‌ళ్లీ త‌న క్యారెక్టర్‌కు సాయిప‌ల్ల‌వి సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంద‌ట‌.ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన థియేటర్లలోకి రానుంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సినిమాను ముందుకు తీసుకువ‌స్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -