Saturday, May 11, 2024
- Advertisement -

కమల్ హాసన్ పై దుమ్మెత్తి పోసిన స్టార్ హీరో..!

- Advertisement -

తమిళనాడులో శరత్ కుమార్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాకుండా నటీనటుల సంఘానికి కూడా అధ్యక్షుడు అని వేరే చెప్పనక్కర్లేదు.

అయితే ఇప్పుడు ఆ అధ్యక్ష స్థానానికి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈయన తన సహనటీనటులపై ఫైర్ అవుతున్నాడు. వారిపై విరుచుకుపడుతున్నాడు. తనకు సహకారం అందించరేమో అనుకొంటున్న వారిపై సూటిగా విమర్శలు చేస్తున్నాడు శరత్ కుమార్. అందులో భాగంగా మరో తమిళ ప్రముఖ నటుడు కమల్ హాసన్ పై విమర్శలు చేశాడు శరత్ కుమార్.

కమల్ ను  కృతజ్ఞత లేని వ్యక్తిగా అభివర్ణించాడు శరత్ కుమార్. తను నడియాగర్ సంఘం అధ్యక్షుడిగా కమల్ ఎంతగానో సహకరించాను అని.. అయితే కమల్ కు మాత్రం కృతజ్ఞత లేకపోయిందని ఆయన విమర్శించాడు. విశ్వరూపం సినిమా విడుదల సమయంలో కమల్ ఇబ్బందులు పడుతూ ఉంటే.. తను సహకరించానని శరత్ చెప్పుకొచ్చాడు. అలాగే ఉత్తమ విలన్ విడుదల సమయంలో తన భార్య రాధిక కమల్ కు సహకరించిందని.. ఈి విధంగా తాము ఆదుకొంటే.. కమల్ మాత్రం ఇప్పుడు తమను విమర్శిస్తున్నాడని.. కమల్ హాసన్ ఏ మాత్రం కృతజ్ఞత లేని మనిషి అని చెప్పడానికి ఇదే రుజువు అని శరత్ కుమార్ వ్యాఖ్యానించాడు. మరి విమర్శలు, ప్రతి విమర్శల్లో నిజానిజాల సంగతి ఏమో కానీ.. ఈ విధంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఆసక్తికరంగా ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -