Friday, April 26, 2024
- Advertisement -

వామ్మో 40 కోట్లు: డీకే అరుణ ఆస్తులను లాగేసుకున్నారు!

- Advertisement -

అధికారం చేతులు మారితే పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. మొన్నటి వరకూ కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నేతలు పోగేసుకున్న ఆస్తులను ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ స్వాధీనం చేసుకొంటోంది.

ఇందులో భాగంగా తాజాగా మాజీ మంత్రి డీకే అరుణకు సంబంధించి ఏకంగా నలభై కోట్ల రూపాయల ఆస్తులను జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకొంది.

ఇది హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఫ్లాట్ కు సంబంధించిన వ్యవహారం. జూబ్లీహిల్స్ ప్రాంతంలో డీకే అరుణ భర్త కొంత కాలం క్రితం రూ.40 కోట్ల రూపాయల విలువజేసే స్థలం తనది అని క్లై మ్ చేసుకున్నాడు. దీనిపై ఆయన కోర్టుకు కూడా వెళ్లాడు.

అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొంది. భారీగా విలువ చేసే ఆ స్థలంపై డీకే అరణ భర్త క్లైమ్స్ చెల్లవు అని జీహెచ్ ఎంసీ స్పష్టం చింది. జీహెచ్ ఎంసీ అధికారులు దగ్గరుండి మరీ ఆ స్తలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో వారు డీకే అరుణ భర్త అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ స్థలంపై వారికి ఎలాంటి హక్కులూ లేవని.. అది పూర్తిగా ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. మరి ఒక్కసారిగా రూ.40 కోట్ల విలువ చేసే స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే మాటలు కాదు. దీనిపై డీకే అరుణ ఫ్యామిలీ ఇప్పటికే కోర్టుకు ఎక్కింది. మరి ఈ స్థలం ఎవరి సొంతం అవుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -