- Advertisement -

బిగ్‌బాస్ నుండి త‌ప్పుకుంటున్నహోస్ట్‌?

- Advertisement -

బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ హిట్ కావ‌డంతో రెండోవ సీజ‌న్ ఘనంగా ఆరంభించారు. మొద‌ట హిందిలో మొద‌లైన ఈ రియాల్టీ షో త‌రువాత తెలుగు,త‌మిళ భాష‌ల‌లో కూడా తీయ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం తెలుగు,త‌మిళ బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌లోకి అడుగు పెట్టాయి. మొద‌టి సీజ‌న్‌లో ఉన్న మ‌జా రెండో సీజ‌న్‌లో లేద‌ని అంద‌రు ఆరోపిస్తున్నారు. ఇక త‌మిళ బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌పై చాలానే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. త‌మిళ బిగ్ బాస్ కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నాడు.

మొదటి సీజన్ సీరియస్ హోస్టింగ్ తో మంచి రేటిగ్స్ వచ్చేలా చేశాడు కమల్ హాసన్. తమిళంలో సెకండ్ సీజన్ కాస్త నిరాశపరుస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఈ షోలో లిప్ లాక్స్ లాంటివి కాస్త అసభ్యకరంగా ఉన్నాయి. ఇదవరకు కమల్ హాసన్ ఒక హీరో మాత్రమే కాని ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ అధినేత. కాబట్టి ఆయన మీద చాలా ఫోకస్ ఉంటుంది. అందుకే ఆయ‌న బిగ్‌బాస్ షో నుండి త‌ప్పుకుంటున్నాడ‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -