Thursday, May 2, 2024
- Advertisement -

ఆ నీచుడు ఉంటే నేను రాను: శ్రీరెడ్డి

- Advertisement -

న‌టి శ్రీరెడ్డి మ‌రోసారి త‌న మాట‌ల‌తో వార్త‌ల్లో నిలిచింది. ఈసారి బిగ్‌బాస్‌ను టార్గెట్ చేసుకుని త‌న మాట‌ల తుటాల‌ను పేల్చింది. బిగ్‌బాస్‌లో అంద‌రు వేస్ట్ ఫేలోస్ ఉన్నార‌ని,వారు పెద్ద సెల‌బ్రిటీల‌గా తెగ బిల్డ‌ప్ కొడుతున్నార‌ని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. త‌నీష్క్‌కు అంత సీన్ లేద‌ని, ఉంటే పెద్ద హీరోనే అయ్యేవాడ‌ని, సామ్రాట్‌, తేజ‌స్వీ, బాబు గోగినేని అంద‌రు గేమ్ ఆడుతున్నార‌ని తెలిపింది. ఇక నాని యాంక‌ర్‌పై కూడా కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. నానికి ఎన్టీఆర్‌కు చాలా తేడా ఉంద‌ని ,న‌క్క‌కు నాగలోకానికి ఉన్న తేడా ఉంద‌ని, నాని యాంక‌రింగ్‌ను ఉద్దేశించి మాట్లాడింది.

ఇక బిగ్‌బాస్ సెల‌బ్రిటీస్‌లో పెద్ద‌గా ఎవ‌రు నాకు తెలియద‌ని తెలిపింది. ఆ నీచుడు ఉన్నంత కాలం నేను బిగ్‌బాస్‌లోకి వైల్‌కార్డ్ ఎంట్రీ ద్వారా కూడా రాన‌ని తెలిపింది. మ‌రి శ్రీరెడ్డి చెప్పిన నీచుడు ఎవ‌రో ఈపాటికి మీకు తెలిసే ఉండాలి క‌దా!ఇక బిగ్‌బాస్ రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టింది. గ‌త వారం ఎలిమినేష‌న్‌లో భాగంగా నూత‌న నాయుడు ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. కిరీటి, గణేష్, తేజ‌స్వీ, భాను శ్రీ, గీత మాధురి ఈ వారం ఎలిమినేష‌న్‌లో ఉన్నారు. వీరిలో ఒక‌రు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -