- Advertisement -
లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా నటించిన చిత్రం విశ్వరూపం-2 .భారీ బడ్జెట్ ,భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు,నిర్మాతగా కూడా కమలే వ్యవహారించారు.ఇప్పటికే విడుదల అయిన టీజర్,ట్రైలర్‌కు సూపర్ రెస్పన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ప్రపంచశాంతికి ప్రమాదంగా మారిన తీవ్రవాదం .. దానిని ఎదుర్కునే దేశభక్తి నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది.సినిమాలోని యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో వున్నాయనే టాక్ ఇప్పటికే బయటికి వచ్చేసింది. ‘విశ్వరూపం’ కథను ఎక్కడైతే ఆపేశారో .. అక్కడి నుంచే ‘విశ్వరూపం 2’ మొదలవుతుందని కమల్ చెప్పారు. తమిళ,తెలుగు భాషలలో విశ్వరూపం-2 ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
