Thursday, May 9, 2024
- Advertisement -

మహేష్ టైటిల్ అదేనా?

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.న‌గ‌ర శివార్ల‌లో కీలక స‌న్నివేశాల‌ను చిత్రిక‌రిస్తున్నారు.ఇక ఈ సినిమా టైటిల్ విష‌యంలో గ‌త కొన్ని రోజులుగా తీవ్ర చ‌ర్చ న‌డుస్తుంది. సోషల్ మీడియా ద్వారా రోజుకో అక్షరాన్ని బయటకు లీక్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటివరకూ ‘ఆర్’, ‘ఐ’, ‘ఎస్’, ‘హెచ్’, ‘ఐ’ అన్న అక్షరాలు బయటకు వచ్చాయి.’ఐ’ లెటర్ ను ఈ ఉదయం 9:15 గంటల సమయంలో సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ ఖాతాలో రివీల్ చేశాడు. వీటిని చూస్తుంటే ఇదే టైటిల్ అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. సినిమా పేరు ‘రిషి’ అని కొందరు ‘మహర్షి’ అయ్యుంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు.

ఇక చిత్రంలో మహేష్ పాత్ర పేరు ‘రిషి’ అయ్యుంటుందని, సినిమా పేరు వేరేగా ఉంటుందని అంటున్నవారూ లేకపోలేదు. ఆగ‌స్టు 9న మ‌హేశ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమాలోని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తార‌ని ఆయ‌న ఫాన్స్ ఆశిస్తున్నారు.ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో మ‌హేశ్ అభిమానులు,ఆయ‌న పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రెట్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.అశ్వనీదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వ‌చ్చే ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.ఈ సినిమాలో మ‌హేశ్‌కు హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తుంది.

https://twitter.com/directorvamshi/status/1026675168544845824/photo/1

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -