Tuesday, May 6, 2025
- Advertisement -

లావుపాటి అనుష్క, స్లిమ్ ఆర్యలతో.. కమల్ పాట రీమిక్స్..!

- Advertisement -

ఇప్పటికే ‘సైజ్ జీరో” సినిమా కొందరికి ఆసక్తికరంగా మారింది. మరికొందరు ఏమో ఈ సినిమా స్టిల్స్ లో అనుష్కను చూసి ఏంటిది?

అంటున్నారు! అనుష్కను తాము అలా చూడలేకపోతున్నామనేది వారి వాదన.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. వీటి సారాంశం ఏమనగా… ఈ సినిమాలో ఒక పాత పాటను రీమిక్స్ చేయనున్నారు. అది కూడా కమల్ హాసన్ పాటను రీమిక్స్ చేస్తున్నారు. సూపర్ హిట్ పాటను మళ్లీ వినిపించబోతున్నారు.

‘క్షత్రియపుత్రుడు’ సినిమా గుర్తుందా? అందులో.. “సన్నాజాజి పాడకా…” అనే పాట బాగా హిట్ కదా.. ఆ పాటను ఈ సైజ్ జీరోలో రీమిక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హీరో ఆర్య, హీరోయిన్ అనుష్కల మీద ఈ పాటను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. బాగా హిట్ అయిన ఆ పాటను రీమిక్స్ చేయడం ద్వారా ఈ సినిమాకు కొత్త సొబగు తీసుకురావాలని ఈ సినిమా యూనిట్ భావిస్తోంది.

ఇప్పటికే ఆ పాట రీమిక్స్ విషయంలోదాని ఒరిజినల్ సంగీత దర్శకుడు ఇళయరాజా అనుమతి తీసుకొన్నట్టుగా సమాచారం. ఇటీవల తన పాటలను ఇష్టానుసారం వాడేసుకోవడం పట్ల ఇళయరాజా అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా యూనిట్ ముందు జాగ్రత్తగా ఇళయరాజా అనుమతి తీసుకొని రీమిక్స్ చేస్తోందని తెలుస్తోంది. 

ఇదే పాటలో అనుష్క, ఆర్యల మద్య కొని లిప్‌లాక్‌ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -