Wednesday, May 1, 2024
- Advertisement -

రామ్ ను ఢీకొట్టే పాత్రలో తమిళ స్టార్ హీరో..!

- Advertisement -

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలు, నటీనటులు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. హీరోలుగా, విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్నారు. ఇప్పటికే సముద్రఖని, సత్యరాజ్ తెలుగులో బిజీ ఆర్టిస్టులుగా మారిపోయారు. తమిళ హీరోలు కూడా తెలుగులో విలన్లు గా నటిస్తున్నారు. అరవింద్ స్వామి ధ్రువ సినిమా లో విలన్ గా కనిపించగా, తాజాగా లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య విలన్ గా నటించనున్నట్టు సమాచారం.

ఆర్యకు తమిళనాట మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కూడా ఆయన నటించిన సినిమాలు విడుదలవుతుంటాయి. ఆయన నటించి తెలుగులో డబ్ అయిన రాజా రాణి సూపర్ హిట్ గా నిలిచింది. ఇదివరకే ఆర్య తెలుగు లో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. లింగస్వామి చేస్తున్న సినిమా.. పక్కా మాస్. హీరోను ఢీ కొట్టడానికి బలమైన విలన్ ఉండేందుకు లింగుస్వామి ఆర్యను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

రామ్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాకు టైటిల్ గా ఉస్తాద్ ను పరిశీలిస్తున్నారు.

Also Read

మరో తమిళ హీరోతో తెలుగు డైరెక్టర్ సినిమా..!

సూర్య నిర్మాతగా హిందీలో ఆకాశమే హద్దురా రీమేక్..!

తమన్ కి తమనే పోటీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -