Thursday, April 25, 2024
- Advertisement -

అమెజాన్​లో ‘సార్​పట్టా’

- Advertisement -

కబాలి, కాలా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యాడు దర్శకుడు పా రంజిత్​. ఈ రెండు చిత్రాలు తెలుగులో భారీ విజయాన్ని నమోదు చేయనప్పటికీ విభిన్న చిత్రాలుగా పేరుతెచ్చుకున్నాయి. ఇక పా రంజిత్​ ఆ తర్వాత ఆర్య హీరోగా మరో ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే ‘సార్​పట్టా’ బాక్సింగ్​ పీరియాడికల్​గా ఈ మూవీ తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్​ పూర్తిచేసుకున్నది. కానీ కరోనా కారణంగా విడుదల కాలేదు.

ఈ మూవీ కోసం ఆర్య సహా.. మిగిలిన నటీనటులందరూ ఎంతో కష్టపడ్డారు. ఇప్పటికే యూట్యూబ్​లో విడుదల చేసిన మేకింగ్​ వీడియోకు మంచి ఆదరణ దక్కించుకున్నది.ఈ సినిమా కోసం ఆర్య తన బాడీ లాంగ్వేజ్​ పూర్తిగా మార్చేశాడు. మేకింగ్​ వీడియో చూస్తే ఆర్య ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. ఇక సినిమా కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ప్రతి నటుడు విభిన్న లుక్​లో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేకపోవడంతో ఈ నెల 22న అమేజాన్​లో స్ట్రీమింగ్​ కానున్నది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్స్ ఎదురు చూశారు. అయితే థియేటర్ల ప్రారంభానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండడం, విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ నష్టం జరిగే అవకాశం ఉండటంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను అమెజాన్ కొనుగోలు చేసింది.

Also Read

అమీర్​ఖాన్​పై ఆరోపణలు.. స్పందించిన చిత్ర యూనిట్ ..!

ఛత్రపతి రీమేక్​ షూటింగ్ కు ముఖ్య అతిథిగా జక్కన్న..!

చేతినిండా సినిమాలుండే స్టార్ హీరో.. కాలేజ్ డేస్ లో ఏం చేసేవాడో తెలుసా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -