Saturday, April 20, 2024
- Advertisement -

సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘కనబడుటలేదు’ టీజర్ అదుర్స్

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య చిన్న చిత్రాలకు మంచి ఆదరణ పెరిగిపోతుంది. కరోనా కష్టకాలంలో చిన్నా, పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో థియేటర్లో మంచి కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రాలకు మంచి క్రేజ్ ఏర్పడుతుంది. తాజాగా సునీల్ ప్రధానపాత్రలో వస్తున్న డిటెక్టివ్ చిత్రం ‘కనబడుటలేదు’. ఓ మిస్సింగ్ కేసు, మ‌ర్డ‌ర్, ఇన్విస్టిగేష‌న్‌ నేపథ్యంలో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్‌. బాలరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. కానీ డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’.. అంటూ కీలకమైన కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే డిటెక్టివ్‌ పాత్రలో నటిస్తున్న సునీల్‌ను పరిచయం చేశారు. నగరంలో వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ మూవీ స్పార్క్ ఓటీటీలో విడుదల చేయనున్నారు.

కనబడుటలేదు’ టీజర్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజ‌ర్ లో షాట్లూ, ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌… అన్నీ బాగున్నాయి. సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనపు, దేవీప్రసాద్ బలివాడ నిర్మాతలు. ఇందులో వైశాలీ రాజ్, సుక్రాంత్ వీరెళ్ల, హిమజ, యుగ్ రామ్, ప్రవీణ్, రవివర్మ, కిరీటి దామరాజు, కంచరపాలెం కిశోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

మధు పొన్నాస్ సంగీత స్వరాలకు చంద్రబోస్, మధు నందన్, పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఈ మధ్య కాలంలో హీరోగా సునీల్‌కి ఆశించిన విజయాలు దక్కడం లేదు. మరి ఈ చిత్రంతో అయినా భారీ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -