Wednesday, May 15, 2024
- Advertisement -

మ‌ణిక‌ర్ణిక ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా..!

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం మణికర్ణిక.టాలీవుడ్ డైర‌క్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.యుద్ద సన్నివేశాల్లోని కంగనా గుర్రపు స్వారీ ఫోజ్‌ అచ్చం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌లా ఉండటంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మిన్నంటాయి.

మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ సమకూర్చారు. ఈ సినిమాను రిపబ్లిక్‌ డే సందర్భంగా 2019 జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో పాటే తెలుగులో సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నాడు క్రిష్.ఎన్టీఆర్ మూవీ ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశాడు క్రిష్‌.ఈ రెండు సినిమాల విజ‌యంపై గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు ద‌ర్శ‌కుడు క్రిష్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -