Wednesday, May 15, 2024
- Advertisement -

యావత్ దేశానికి తెలంగాణ ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనా…సీఎం కేసీఆర్‌

- Advertisement -

తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు ప‌య‌నిస్తోంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు.యావత్ దేశానికి తెలంగాణ ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించిందని తెలిపారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలకు సీఎం ప్రసంగించారు.

రాష్ట్రంలో కుదేలైన రంగాలన్ని నేడు పునరుత్తేజం పొందాయన్నారురాష్ట్రాభివృద్ధిపై సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులోనూ ప్రశంసలు కురిపించారని అన్నారు. సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అండగా ఉన్నాయని తెలియజేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి దశలోనే రైతులకు రూ.17 వేల కోట్లు రుణాలు మాఫీ చేశామని అన్నారు. గత పాలకుల హాయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. నకిలీ, కల్తీ విత్తనాలు సరఫరా చేస్తోన్న సంస్థలపై ఉక్కుపాదం మోపామని తెలిపారు.

రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ అద్భుతం సాధించడానికి ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా నిబద్దతతో కృషి చేసిందని సీఎం తెలిపారు. గ్రామాల్లో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులకు సబ్సిడీపై వరినాటు యంత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాది మండలానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,500 వరినాటు యంత్రాలు పంపిణీ చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

సమైక్య రాష్ట్రంలో పాలకులు ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని పునఃప్రారంభించామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశామని, మరికొన్నింటి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధిరించే బృహ‌త్తర కార్యక్రమం చేపట్టామని అన్నారు. సమైక్య రాష్ట్రంలో కుప్పకూలిపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. కులవృత్తుల అభ్యున్నతికి మూడంచెల వ్యవస్థను అనుసరిస్తున్నామని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -