Saturday, May 18, 2024
- Advertisement -

కేంద్ర రాజ‌ధానికి స‌హాయం చేయ‌కున్నా ముందుకెల్తున్నాం…సీఎం చంద్ర‌బాబు

- Advertisement -

భజన అనంతరం ఏపీలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 72 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు శ్రీకాకుళం వేదికైంది.ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవందనాన్ని స్వీకరించారు.

అన్ని జిల్లాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే స్వాతంత్రదినోత్సవ వేడుకలు అన్ని జిల్లాల్లోనూ నిర్వహించాలని భావించామని అన్నారు. అందుకే తొలి ఏడాది కర్నూలు, రెండో ఏడాది విశాఖ, మూడో ఏడాది అనంతపురం, నాలుగో ఏడాది తిరుపతిలో నిర్వహించి ప్రస్తుతం శ్రీకాకుళంలో జరుపుకుంటున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం జారీచేసిన బాండ్లకు అనూహ్య స్పందన వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బాండ్లను బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ లో లిస్ట్ చేయగానే ఒక్క రోజులోనే అమ్ముడుపోయాయని వెల్లడించారు. దీనిద్వారా రాష్ట్రానికి రూ.2,000 కోట్ల మేర నగదు సమకూరిందని పేర్కొన్నారు.

ఆర్ధికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విభజనతో నష్టపోయినా అభివృద్ధి ఆగకుండా చూశామని, నాలుగేళ్లలో రెండంకెల అభివృద్ధి సాధించామని అన్నారు. సంకల్ప బలం ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించగమని, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టి దిగుబడులు పెంచి, రైతులకు రూ.24,500 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. 2029 నాటికి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలబడాలనే ఉద్దేశంతో ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు సాగుతున్నామని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -