Friday, May 17, 2024
- Advertisement -

కంగ‌నా ‘మ‌ణిక‌ర్ణిక’ ట్రైల‌ర్ రివ్యూ

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ న‌టించిన మ‌ణ‌క‌ర్ణిక సినిమా ట్రైల‌ర్‌ను గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు విడుద‌ల చేశారు.మ‌ణిక‌ర్ణిక సినిమాలో కంగ‌నా ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో న‌టిస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.సినిమా మొద‌టి నుంచి వివాదాల‌తోనే సాగుతుంది.కంగనా ప్ర‌వ‌ర్త‌న‌తో చాలమంది సినిమా నుంచి త‌ప్పించుకున్నారు.మ‌ణిక‌ర్ణిక ట్రైల‌ర్ కోసం బాలీవుడ్ జ‌నాలల‌తో పాటు ,యావ‌త్తు దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూస్తు ఉంది.అయితే ఈ రోజు విడుద‌ల అయిన మ‌ణిక‌ర్ణిక ట్రైల‌ర్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదనే మాట‌లు వినిపిస్తున్నాయి.

అమితాబ్ బచ్చన్ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ లో ఝాన్సీ లక్ష్మీబాయ్ ధైర్య సాహసాలు, బ్రిటీష్ వారితో ఆమె పోరాట ఘట్టాలను చూపించారు.ట్రైల‌ర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా చేసి నిరాశ ప‌రిచారు.కంగనా లుక్ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ పోరాట సన్నివేశాల్లో ఆమె హావభావాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.ఈ ట్రైల‌ర్‌లో మాత్రం ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ ధైర్య సాహ‌సాలు,బ్రిటీష్ వారితో ఆమె పోరాట ఘాట్టాల‌ను చూపించారు.మ‌ణిక‌ర్ణిక సినిమాకు మ‌న తెలుగు డైర‌క్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమాను జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -