Wednesday, May 8, 2024
- Advertisement -

పోలీసుల చేతికి రేవంత్ రెడ్డి లావాదేవీల హార్డ్ డిస్క్?.

- Advertisement -

తెలంగాణా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెల‌సిందే. రేవంత్ ఇంటినుంచి ఇప్ప‌టికే కీల‌క డ్యాక్యుమెంట్లును స్వీధీనం చేసుక‌న్న అధికారులు తాజాగా ఓ హార్డ్ డిష్క్‌ను స్వాధీనం చేసుకొన్న‌ట్లు తెలుస్తోంది.

రేవంత్ బంధువుల ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ ఇప్పుడు కీల‌కంగా మారింది. ఈ హార్డ్ డిస్కులో రేవంత్ రెడ్డి జరిపిన పలు లావాదేవీల వివరాలు ఉన్నాయని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఉదయ్ సింహ బంధువు రణధీర్ రెడ్డి ఇంట్లో ఇది టాస్క్ ఫోర్స్ పోలీసులకు లభ్యమైనట్టు తెలుస్తోంది. దీంతో రెండు రోజులుగా ర‌ణ‌ధీర్ పేరు బ‌లంగా వినిపిస్తోంది.

రెండు రోజుల క్రితం ఐటీ అధికారులమని చెబుతూ వచ్చి, ఆయన ఇంట్లో సోదాలు చేసిన వారు, నిన్నంతా రణధీర్ ను అదుపులో ఉంచుకుని గత రాత్రి 12 గంటల సమయంలో ఆయన్ను ఇంటి వద్ద వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. మూడు నెలల క్రితం ఇల్లు మారుతున్న సమయంలో ఉదయ్ సిన్హా తనకు ఆ హార్డ్ డిస్క్ ఇచ్చారని తెలిపారు. హార్డ్ డిస్క్‌లో ఏముందో తనకు అయితే తెలియదన్నారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని తనకు నోటీసులు ఇచ్చారని ర‌ణ‌ధీర్ తెలి పారు. సదరు హార్డ్ డిస్క్ లో ఏముందన్న కోణంలో పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. దాన్ని తెరచి, అందులో ఉన్న వివరాలను విశ్లేషించే పనిలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -