Thursday, May 16, 2024
- Advertisement -

టాప్ హీరోయిన్ల మ‌ధ్య భ‌గ్గుమ‌న్న విభేదాలు

- Advertisement -

బాలీవుడ్‌కు చెందిన టాప్ హీరోయిన్లు కంగ‌నా ర‌నౌత్‌,సోన‌మ్ క‌పూర్‌ల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.ప్ర‌స్తుతం బాలీవుడ్ మొత్తం కాస్టింగ్ కౌచ్ చూట్టునే తిరుగుతుంది.దీనిలో భాగంగానే హీరోయిన్ కంగ‌నా ‘క్వీన్’ దర్శకుడు వికాస్ బెహెల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కామెంట్స్ చేసింది.వికాస్ బెహెల్ త‌న‌ను సినిమా షూటింగ్ స‌మయంలో చాల ఇబ్బంది పెట్టారంటూ చెప్పెకొచ్చింది.అయితే కంగ‌నా చేసిన కామెంట్స్‌పై స్పందించింది హీరోయిన్ సోన‌మ్ క‌పూర్‌.

కొన్నిసార్లు కంగన చేసే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం కష్టమని, అయినప్పటికీ ఆమె తనకు జరిగిన ఘటనల గురించి ధైర్యంగా బయటపెట్టడం అభినందించదగ్గ విషయమని..ఈ విషయంలో ఆమెను తాను గౌరవిస్తానని చెప్పింది. అయితే, సోనమ్ చేసిన వ్యాఖ్యలపై కంగన మండిపడుతోంది.సోనమ్ వ్యాఖ్యలకు అర్థమేంటని ప్రశ్నించింది. కొందరు మహిళలను మాత్రమే నమ్మాలన్న లైసెన్స్ ఆమెకు ఉందా? నేను చెప్పేవి తప్పని ఆమె ఎలా చెప్పగలుగుతంది? అంటూ మండిపడింది. సోనమ్ కపూర్‌లా తండ్రి వ‌ల్ల నేను పైకి రాలేద‌ని సోన‌మ్‌కు కౌంట‌ర్ ఇచ్చింది క్వీన్ బ్యూటీ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -