Wednesday, May 15, 2024
- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై నాయిని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగే ఎన్నిక‌లే హైలెట్ కానున్నాయి. అయితే తెలంగాణాలో ముందుగానే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అక్క‌డ కేసీఆర్ సీఎం అని అనేక స‌ర్వేలు తేల్చాయి. ఇక ఏపీలో కూడా జ‌గ‌నే అధికారాన్ని చేప‌డ్తార‌ని స‌ర్వేలు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణా హోమంత్రి నాయిని న‌ర‌శింహారెడ్డి జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

శత్రువు శత్రువు తమకు మిత్రుడు అన్న సామెత ఇప్పుడు టీఆర్ఎస్‌, వైసీపీకీ స‌రిపోతుంది. టీఆర్ఎస్ కూడా ఇదే ఫార్ములానూ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఏపీ అధికార పార్టీ టీడీపీని చీల్చి చెండాడుతున్న టీఆర్ఎస్.. అదే సమయంలో అక్కడి ప్రతిపక్ష పార్టీ వైసీపీపై సానుకూల వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా ఆపద్దర్మ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్‌దే అధికారం అని జోస్యం చెప్పారు.

గత 2014ఎన్నికల సమయంలో ఏపీలో వైసీపీ గెలుస్తుందని కేసీఆర్ అప్పట్లో అంచనా వేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ.. టీడీపీయే అధికారాన్ని చేజెక్కించుకుంది. అయితే ఈ నాలుగేళ్ల‌లో బాబు ప్ర‌భుత్వం మీద తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్నా కాబట్టి నాయిని చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా? అన్నది తెలియాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -