Saturday, May 18, 2024
- Advertisement -

భ్ర‌హ్మాస్ క్షిప‌ణి యూనిట్‌లో ఐఎస్ఐ గూఢ‌చారి అరెస్ట్‌..స‌మాచారం లీక్ అయ్యిందా…?

- Advertisement -

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పన్నిన మరో పన్నాగం బయటపడింది. భారత్ అమ్ములపొదిలో ఉన్న కీలకమైన క్షిప‌ణుల‌లో బ్రహ్మోస్ క్షిపణులు అత్యంత శ‌క్తివంత‌మైన‌వి. నాగ్‌పూర్ యూనిట్లో బ్రహ్మోస్ తయారీ యూనిట్‌లో పనిచేస్తున్న ఓ సైంటిస్ట్ పాకిస్థాన్ గూఢచార సంస్థకు చెందిన ఐఏఎస్ ఏజెంట్‌ను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈరోజు అరెస్ట్ చేసింది.

నిషాంత్ అగర్వాల్ అనే సైంటిస్ట్ గత నాలుగేళ్లుగా మహారాష్ట్ర నాగపూర్‌లోని బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, అతను ఐఏఎస్ గూఢచారిగా అనుమానిస్తూ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది.

బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన సమాచారం ఐఎస్ఐకి లీక్ అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం రెండు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ అన్వేషిస్తున్నాయి. ఈ గూఢచర్యం వెనుక మరో ఏజెన్సీ కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాన్పూర్ లోని మరో ఇద్దరు సైంటిస్టుల ప్రమేయం కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, నాగపూర్ యూనిట్లో బ్రహ్మోస్ క్షిపణులకు ప్రొపెల్లెంట్, ఇంధనం వంటిని సమకూరుస్తున్నారు.

గత నెలలో మధ్యప్రదేశ్‌కు చెందిన అచ్యుతానంద మిశ్రా అనే బీఎస్ఎఫ్ జవాన్‌ను యూపీకి చెందిన ఏటీఎస్ అరెస్ట్ చేసింది. డిఫెన్స్ రిపోర్టర్ పేరుతో పరిచయమైన యువతికి భారత సైన్యం ఆపరేషన్స్‌కు సంబంధించి పలు కీలక సమాచారం చేరవేసినట్టు ఏటీఎస్ గుర్తించింది

అంతకు ముందు మే నెలలో కూడా ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా అరెస్టయ్యాడు. రమేష్ సింగ్ అనే వ్యక్తి పాకిస్థాన్‌‌లోని భారత రాయబార కార్యాలయంలో కుక్‌గా విధఉలు నిర్వహిస్తున్నాడు. అయితే, ఇస్లామాబాద్‌లో ఓ పాక్ అధికారిని పలుమార్లు కలిసినట్టు తేలడంతో అతడ్ని అనుమానించి అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -