Wednesday, May 8, 2024
- Advertisement -

బాబు, మోడీలపై పోలీసు కేసులు..!

- Advertisement -

ఏపీ ప్రత్యేక హోదా అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త పోరాటానికి రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర విభజన సమయంలో..

ఏపీకి ఐదు, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బీజేపీ వాళ్లు ఇప్పుడు మోసం చేస్తున్నారని… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వెనుకాడుతున్నారని విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో పోరాటాన్ని కొత్త బాట పట్టించడానికి రెడీ అవుతున్నారు. విశేషం ఏమిటంటే.. ఈపోరాటంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీల మీద పోలీసు కేసు పెట్టాలని కాంగ్రెస్ వారు భావిస్తున్నారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలిస్ స్టేషన్లలోనూ కేసులు పెట్టిస్తామని  కాంగ్రెస్ ఏపీ విభాగం అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించాడు. ప్రజల ఇన్ వాల్వ్ మెంట్ తో ఈ కేసులు పెట్టడం జరుగుతుందని… కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, ప్రజలే ఈ కేసులు పెడతారని.. ఒక ఉద్యమంలా అన్ని స్టేషన్లలోనూ కేసులు పెట్టిస్తామని ఆయన అన్నారు. నమ్మకద్రోహం కింద కేసులు పెట్టిస్తామని.. ఎన్నికల ముందు  హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని..ఇప్పుడు ఆ హామీలు అమల్లో పెట్టకపోవడం గురించి ఈ పోరాటాన్ని చేస్తామని రఘువీరారెడ్డి అంటున్నాడు.

మరి ఈ కేసులు పెట్టే ఉద్యమం ఏదో ఆసక్తికరంగానే ఉంది కానీ… అసలు కాంగ్రెస్ వాళ్లు చేసే ఫిర్యాదులను పోలీసులు పరిగణనలోకి తీసుకొంటారా? ప్రధాని, ముఖ్యమంత్రులపై కేసులు నమోదు చేస్తారా? అనేది సందేహాస్పదమైన విషయమే. ఎలాగూ ఫిర్యాదు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి.. ఫిర్యాదులను పోలీసులు పరిగణనలోకి తీసుకోని అవకాశాలే ఎక్కువ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -