Sunday, May 11, 2025
- Advertisement -

ఇల్లీగల్ కేసులో హీరో అరెస్ట్‌… ఏం చేశాడో తెలుసా?

- Advertisement -

క‌న్న‌డ సినిమాల‌లో హీరో జగదీశ్ సోమ‌వారం అరెస్ట్ అయ్యేర‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది.పూర్తి వివారాల్లోకి … జగదీశ్ ఇల్లీగ‌ల్‌గా తుపాకీ కొనుగోలు చేశార‌నే కార‌ణంతో పోలీసులు అరెస్ట్ చేశార‌ని తెలుస్తుంది.సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మొహమ్మద్ నైజాం(25) అనే వ్యక్తిని ఇల్లీగల్ పనులు చేస్తోన్న కారణంగా అదుపులోకి తీసుకున్నారు. మొహమ్మద్ నైజాం దగ్గర హీరో జగదీశ్ నాటు తుపాకీని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అరెస్ట్ చేసిన వారి దగ్గర నుండి పోలీసులు 2 తుపాకీలను, బులెట్ లను స్వాధీనం చేసుకున్నారు. జగదీశ్ కన్నడ సినిమా ‘సర్కార్’ లో లీడ్ రోల్ పోషించాడు. పోలీసులు అరెస్ట్ చేయడంతో జగదీష్ తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని.. తాను అమాయకుడినని అంటున్నాడు. ఓ పార్సిల్ త‌న ద‌గ్గ‌ర‌కి వ‌చ్చింద‌ని ,తీరా చూస్తే దానిలో తుపాపాకీ ఉంద‌ని ఎవ‌రో కావ‌ల‌నే నాపై కుట్ర చేశార‌ని అంటున్నారు హీరో జగదీశ్.అత‌ని అరెస్ట్‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -