Thursday, May 9, 2024
- Advertisement -

అంబులెన్స్ డ్రైవర్ గా మారిన సినీ నటుడు!

- Advertisement -

కర్ణాటకలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొవిడ్‌ మృతదేహాలతో శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి. బెంగళూరులోని శ్మశాన వాటికల ముందు అంబులెన్సులు క్యూ కట్టాయి. ఇలాంటి సమయంలో కొంత మంది స్వార్థపరులు అంబులెన్స్ కోసం వెళ్తే దారుణంగా దోచుకుంటున్నారు. దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మరోసారి 3లక్షలకు పైగా కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3లక్షల 86వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 2లక్షల 97వేల 540మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ప్రముఖ కన్నడ సినీ నటుడు అర్జున్ గౌడ కరోనా బాధితుల కోసం అంబులెన్స్ డ్రైవర్ గా మారారు. ఇప్పటికే పలువురు సినీ నటులు కరోనా బాధితుల కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సోనూ సూద్ అయితే పేద ప్రజలకు దైవంగా మారారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినీ నటుడు అర్జున్ గౌడ కరోనా బాధితుల కోసం నేను అంటూ ముందుకు వచ్చాడు. బెంగళూరు పరిధిలో కరోనా రోగులను ఆసుపత్రులకు తరలించడమే కాదు, కరోనాతో కన్నుమూసిన వారి అంత్యక్రియలకు ఉదారంగా సహకరిస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచి తన మకాం రోడ్డుపైనే అని అర్జున్ గౌడ వెల్లడించారు. ఈ కష్టకాలంలో ప్రాంతాలు, మతాలకు అతీతంగా సాయం చేయాలని అందరికీ పిలుపునిచ్చారు.

కరోనాని కూడా రాజకీయం చేస్తున్న తండ్రీ కొడుకులు : విజయ్ సాయిరెడ్డి

అలాంటి వారు పరీక్షలు రాయనవసరం లేదు : మంత్రి ఆదిమూలపు సురేశ్

ఇంట్లో ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయిన నటి ప్రగతి.. వీడియో వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -