Saturday, April 27, 2024
- Advertisement -

ఇండస్ట్రీలో వరుస మరణాలు కలచి వేస్తున్నాయి!

- Advertisement -

గత ఏడాది నుంచి సినీ ఇండస్గ్రీలో వరుస మరణాలు కలచి వేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా పలువురు సినీ దిగ్గజాలు కన్నుమూశారు. అంతే కాదు దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు, నేపథ్యగాయకులు ఇలా ఎంతో మంది కరోనా కారణంగా చనిపోతే మరికొంత మంది అనారోగ్యంతో కన్నుమూశారు. మరికొంత మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఇలా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలచి వేస్తున్నాయి. జాతీయ అవార్డు గ్రహిత‌‌, ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్‌ కన్నుమూశారు. శనివారం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం(జూన్‌ 14) ఆయన మృతి చెందారు. విజయ్ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. విజయ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

కాగా విజయ్‌ మృతి వార్తతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. స్టార్‌ హీరోలు సుదీప్‌, రాక్‌స్టార్‌ యశ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా, శుక్రవారం స్నేహితుడిని కలిసి బైకుపై ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో విజయ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వెంటనే అతడిని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇక నటుడు విజయ్‌ ‘రంగప్ప హోంగ్బిట్నా’ అనే సినిమాతో 2011లో వెండితెరపై అరంగేట్రం చేశారు. ‘హరివూ’, ‘ఒగ్గరానే’ సినిమాలతో స్టార్‌ హోదా పొందాడు. తను ట్రాన్స్‌జెండర్‌గా నటించిన ‘నాను అవనల్ల.. అవలు’ సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. తను చివరిసారిగా ‘యాక్ట్‌ 1978’ చిత్రంలో నటించారు.

జియాన్‌ఘాకా .. 39 మంది భార్యలకు భర్త.. ఇంకా చనిపోలేదట.. ఈ ట్విస్ట్ ఏమిటి?

గతంలోకి వెళ్లిన రవితేజ.. క్రేజి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు?

తారక్​ మూవీలో విజయ్​ సేతుపతి..! ఏ క్యారెక్టర్​ అంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -