Sunday, May 19, 2024
- Advertisement -

స్టార్ హీరోపై కూతురి ఫిర్యాదు..!

- Advertisement -

క‌న్న‌డ న‌టుడు దునియా విజయ్‌పై ఆయ‌న కూతురు మౌనిక పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.నటుడు దునియా విజయ్ తరచూ ఏదోక వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్ మీద బయటకొచ్చాడు. అలానే తన ఇద్దరు భార్యలు గొడవ పడుతుండడం కూడా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ మొదటి భార్యకి మోనిక అనే కూతురు ఉంది. ఆమె వయసు 19 సంవత్సరాలు. ఇటీవల ఆమె తన తండ్రి దునియా విజయ్ తనపై చేయి చేసుకున్నాడని మోనిక కేసు పెట్టింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్ మాత్రం మోనికని అసలు కొట్టలేదని, ఆమె తల్లి నాగరత్న కావాలని తనపై ఈ విధమైన ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే పలు కేసులతో ఇబ్బందుల్లో ఉన్న విజయ్ కి ఈ కేసు తలనొప్పిగా మారింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -