Sunday, April 28, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ తో కన్నడ భామ చెట్టాపట్టాల్

- Advertisement -

పవర్ లో ఉన్న కథానాయకుడితో కలరింగ్ ఇస్తే…కాస్త కెరియర్ గ్రాఫ్ పెరుగుతుందని ప్రతి అమ్మడికి ఆశ ఉంటుంది.అయితే ఈవిషయంలో కన్నడ భామ లక్ష్మీరాయ్ కు అత్యాశే పుట్టుకొచ్చింది.

సర్దార్ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం పవన్ తో జతకట్టడానికి రాయ్ లక్ష్మీ కాస్త ఎక్కువగా హడావిడి చేస్తోందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.అయితే లక్ష్మీరాయ్ చేసిన ఐటమ్ సాంగ్స్ సెంటిమెంట్ పరంగా భాగా వర్కవుట్ అవుతూ ఉండడంతో…. లక్ష్మీని పవన్ వదులుకోలేకపోతున్నాడని సమాచారం.

అయితే ఈసినిమాలో లక్ష్మీరాయ్ ను కేవలం ఐటమ్ తోనే సరిపెడతారా…? లేక సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా ఇస్తారా అన్నది తెలియకుండా ఉంది. 

హైట్ పరంగానే కాకుండా ఫిగర్ పరంగాను…. పవన్ తో చేస్తే స్క్రీన్ లుక్ లో ఈవిడగారి డామినేషన్  ఇట్టే పెరిగిపోతోంది కాబట్టి… మ్యాక్జిమమ్ ఐటమ్ సాంగ్ తోనే సరిపెట్టేయెచ్చు. ఈమధ్యకాలంలో పవన్ ను కాస్త ఎక్కువగా ఆకట్టుకున్న బ్యూటీ లక్ష్మీరాయేనంటూ బెంగుళూరులో ప్రచారం సాగుతూ ఉండడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -