Friday, May 17, 2024
- Advertisement -

మహేశ్‌ను ఇంప్రెస్ చేసిన సినిమా ట్రైలర్..!

- Advertisement -

మహేశ్ బాబుకు కంచె ట్రైలర్ తెగ నచ్చెసిందట. ఆ ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ప్రిన్స్ మహేశ్ బాబు. కంచె మూవీ డైరెక్టర్ క్రిష్‌కు ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపాడట. ఫెంటాస్టిక్‌గా ఉందని చెప్పాడట.

ఈ మూవీ జార్జియా, యూఎస్‌లలో ఏకధాటిగా షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. సెకండ్ వరల్డ్ వార్‌ మరియు లవ్‌కు సంబందించిన మూవీ కంచె ప్రేక్షకులను ఏ పాటికి ఆకర్షిస్తుందో తెలీదు కానీ ట్రైల్ర్ మాత్రం హల్ చల్ చేస్తోంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయినఫ్ఫటి నుంచి ఇండస్ట్రీలో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో ఇంప్రెస్ అయి ఫోన్ చేసి మరీ డైరెక్టర్‌కు కంగ్రాట్స్ చెప్పడంతో ఇండస్ట్రీలో అంచనాలు పెరిగిపోయాయి అని టాక్. ఆ మధ్య డైరెక్టర్ క్రిష్, హీరో మహేశ్ బాబు ఒక సినిమా చేయాలనుకుని ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక ముందు క్రిష్ డైరెక్షన్‌లో మహేశ్ బాబు సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సినీ వర్గాల సమాచారం.  

{youtube}UqhrfKnAfnQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -