Sunday, May 5, 2024
- Advertisement -

భ‌ళ్లాలదేవుడికి జోడీగా క‌న్న‌డ భామ‌

- Advertisement -

బాల ద‌ర్శ‌క‌త్వంలో రానా సినిమా

వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మంచి విజ‌యాలు అందుకుంటున్న న‌టుడు రానా ద‌గ్గుబాటి. బాహుబ‌లిలో భ‌ళ్లాల‌దేవుడిగా క‌నిపించిన రానాకు ప్ర‌పంచంవ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాతులు వ‌చ్చాయి. అంత‌ర్జాతీయ స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాల‌తో హీరోగా రెండు హిట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. దాంతో సోష‌ల్ మీడియాలో, ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌తో ప్రేక్ష‌కుల‌కు ఎప్పుడూ ట‌చ్‌లో ఉన్నాడు.

రానా తమిళ సినిమాలపై కూడా కొంత ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు. ఇప్పటికే పలువురు తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్న రానా బాల ద‌ర్శ‌క‌త్వంలో ఒక పిరియాడికల్ సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడు. అయితే ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలతో ఆలస్యమవుతోంది. అయితే ఈ సినిమాలో రానా స‌ర‌స‌న క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టించ‌నుంద‌ట‌. తెలుగులో సంచ‌ల‌న విజ‌యం పొందిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళ రీమేక్‌ను బాల చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తవగానే రానా సినిమాను ప్రారంభిస్తార‌ట‌. ఈ చిత్రంలో విశాల్, అనుష్క, ఆర్య, అరవింద స్వామి, ఆత్రవ మురళీ వంటి స్టార్ నటీనటులు నటించనున్నారు.

https://www.youtube.com/watch?v=BTdGs0dqlg4

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -