- Advertisement -

చిరును న‌మ్ముకున్న మెగా అల్లుడు

- Advertisement -

మ‌రో రీమేక్ పాట‌తో సాయిధ‌ర‌మ్‌తేజ్‌

సినిమా పాట‌ల రీమేక్‌ల ప‌రంపర కొన‌సాగుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సినిమాల రీమేక్ హ‌వా కొన‌సాగుతోంది. ఆయ‌న న‌టించిన సినిమాల్లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన పాట‌ల‌ను మెగా హీరోలు రీమేక్‌లు చేస్తున్నారు. ఆ పాట‌ల‌తో త‌మ సినిమాకు ఓ హైప్ తీసుకువ‌స్తుంద‌నే భావ‌న‌తో రీమేక్‌లు చేస్తున్నారు. అందులో భాగంగానే ‘బంగారుకోడిపెట్ట’, ‘వానా వానా వెల్లువాయే’, ‘శుభలేక రాసుకున్నా..’, ‘గోలీమార్‌..’, ‘గువ్వ గోరింక’, ‘అందం హిందోళం’ పాట‌లు రీమేక్ చేశారు.

ఈ రీమేక్‌లు చేసిన‌వారంతా మెగా కుటుంబానికి చెందిన సినిమా హీరోలే. రామ్‌చరణ్‌ నటించిన ‘మగధీర’లో ‘బంగారుకోడిపెట్ట’, ‘రచ్చ’లో ‘వానా వానా వెల్లువాయే’, ‘నాయక్‌’లో ‘శుభలేక రాసుకున్నా..’ పాటలు రీమేక్ చేశారు. అయితే మెగా అల్లుడు సాయి ధరమ్‌ తేజ్ చిరంజీవి మాదిరి డ్యాన్స్ చేస్తూ ‘గోలీమార్‌..’, ‘గువ్వా గోరింక’, ‘అందం హిందోళం’ పాటల రీమేక్‌లు చేశారు. ఈ పాట‌ల్లో చిరంజీవి క‌న్నా సాయిధ‌ర‌మ్ తేజ్ డ్యాన్స్‌ల‌తో అద‌ర‌గొట్టాడు. చిరంజీవి ల‌క్ష‌ణాల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు.

ఇప్పుడు మ‌ళ్లో పాట‌ను రీమేక్ చేయ‌నున్నాడ‌ట‌. 1990లో చిరంజీవి నటించిన ‘కొండవీటి దొంగ’ సినిమాలోని ఓ సూపర్‌ హిట్‌ పాటను రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ‘చమక్‌ చమకు ఛాం..’ పాటను రీమేక్‌ చేయనున్నట్లు స‌మాచారం. ఈ సినిమాలో ధరమ్‌ తేజ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. సీకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2018 ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -