Sunday, April 28, 2024
- Advertisement -

కన్నప్ప ఫస్ట్ లుక్‌..అదిరిపోయింది

- Advertisement -

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇవాళ శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చారు విష్ణు. ఇంటెన్స్ లుక్‌లో చేతిలో విల్లు పట్టుకొని జలపాతం నుంచి బయటకు వస్తూ మంచు విష్ణు కనిపించాడు. ఈ పోస్టర్ చూడగానే అందరిని ఆకట్టుకుంటోంది. బ్రేవెస్ట్ వారియర్.. ది అల్టిమేట్ డివోటీ (ఎంతో ధైర్యం కలిగిన యోధుడు.. పరమ భక్తుడు) అనే ట్యాగ్ లైన్ బాగుంది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ నాస్తికుడు శివుడికి ప‌ర‌మ‌భ‌క్తుడిగా ఎలా మారాడ‌ద‌న్న‌ది క‌న్న‌ప్ప కథ సారాంశం.
కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -