Monday, May 13, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్…రేవంత్‌కు షాక్

- Advertisement -

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వివిధ రాష్ట్రాలకు చెందిన 36 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఛత్తీస్‌ఘడ్‌ 6,కర్ణాటక 6,కేరళ నుండి 20,మేఘాలయ 2,నాగాలండ్ 1,సిక్కిం 1,తెలంగాణ 4,త్రిపుర 1 విడుదల చేసింది. వీటితో పాటు కర్ణాటకకు చెందిన 2, తెలంగాణలోని మహబూబ్ నగర్ ను హోల్డ్‌లో పెట్టింది.

తెలంగాణ నుండి నాలుగు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్లగొండ నుంచి కందుకూరు రఘువీర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఉన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని సైతం పూరించారు. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ అధిష్టానం హోల్డ్‌లో ఉంచి రేవంత్‌కు షాకిచ్చింది.

అయితే వాస్తవానికి 100 మందికి పైగా అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఉంటుందని భావించినా 36 మందితోనే రిలీజ్ చేసింది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుండే పోటీ చేయనున్నారు. 2019లో అమేథి,వాయనాడ్ రెండు చోట్ల పోటీచేయగా అమేథిలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోగా, వాయనాడ్ లో గెలుపొందారు రాహుల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -