Saturday, May 4, 2024
- Advertisement -

కన్నప్ప..లుక్స్ అదుర్స్

- Advertisement -

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్నప్పను తెరకెక్కిస్తున్నారు.మహాభారతం సీరియల్ తీసిన ముకేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప తెరకెక్కిస్తుండగా మణిశర్మ మరియు స్టీఫెన్ దేవస్సి లు సంగీతం అందిస్తున్నారు.

ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కాగా కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ వస్తున్న శరత్ కుమార్ కూడా ఓ కీ రోల్ పోషిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుండగా శ్రీకాళహస్తిలోని గుడిలో రీసెంట్‌ సినిమా షూటింగ్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

తాజాగా సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఇవాళ విష్ణు బర్త్ డే సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయగా బాణం విల్లు పట్టుకుని ప్రకృతి మహా శివలింగం ముందు వారియర్‌గా విష్ణు ఉన్న ఫోటో సూపర్బ్‌గా ఉంది. ఈ ఫస్ట్ లుక్‌ గురించిన చర్చ టీ టౌన్‌లో నడుస్తోంది. న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అయితే ఈరోజు మంచు విష్ణు పుట్టినరోజు కానుకగా అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -