Saturday, May 4, 2024
- Advertisement -

పుష్ప 2..బడ్జెట్‌పై నిర్మాతల టెన్షన్!

- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతన్న చిత్రం పుష్ప 2. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ ఊహించని సక్సెస్ సాధించడంతో సెకండ్ పార్టుపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2024 ఆగస్టు 15న విడుదల కానుంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో జాతరకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా సినిమాకే హైలైట్‌గా నిలవనుందట.

అయితే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌డానికి ముందే కొన్ని కోట్లు ఖ‌ర్చ‌య్యాయట. ఇక షూటింగ్ మొద‌ల‌య్యాక ఖ‌ర్చు గురించి చెప్పనక్కర్లేదట. చిన్న చిన్న సీన్లు తీయ‌డానికే ఎక్కువ సమయం పడుతోండగా భారీ సెట్టింగ్స్ వేసి షూట్ చేస్తున్నారట. ఇక ఒక్కో సీన్‌లో వందలాది మంది పనిచేస్తుండటం, రిహార్సల్స్‌ ఇలా అనుకున్న బడ్జెట్ ఎప్పుడో దాటిపోయిందట. సెకండ్ పార్ట్ దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించాలనుకుంటే అది మరో వంద కోట్లు పెరిగిపోయిందట. సినిమా పూర్తిగా కంప్లీట్ అయ్యే సరికి బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుండగా నిర్మాతల టెన్షన్‌ మాములగా లేదట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -