Friday, May 10, 2024
- Advertisement -

బాలీవుడ్ డైరెక్టర్ తన స్వార్థం కోసమే రాజమౌళిని పొగిడేస్తున్నాడా!

- Advertisement -

రాజమౌళిని మరీ ఎక్కువగా ప్రశంసించేస్తున్నాడు ఒక బాలీవుడ్ దర్శకడు. ఈ ప్రశంసల వెనుక ఆయన స్వార్థం కూడా ఉంది. తెలుగు దర్శకుడిపై తను పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడానికి ఆయన ఈ ప్రశంసలకు దిగాడు.

హిందీలో తన సినిమాను మార్కెట్ చేసుకోవడానికి ఆయన ఎత్తును వేస్తున్నాడు. ఈ ప్రశంసల తీవ్రత మరీ హెచ్చు మీరడంతో.. కొంచెం ఓవర్ అయ్యిఏందో అనుకోవాల్సి వస్తోంది! 

ఇంతకీ విషయం ఏమిటంటే.. “బాహుబలి సినిమాను ప్రతి ఒక్క భారతీయుడూ చూడాలి..    ఆ స్థాయిలో ఉంటుందీ సినిమా..” అని అంటున్నాడు కరణ్ జోహార్. ఈ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తాజాగా ఈ ప్రకటన చేశాడు. బాహుబలి సినిమా భారతీయులు గర్వించదగ్గ సినిమా అని ఈయన చెబుతున్నాడు. అందరూ దీన్ని చూడాలని అంటున్నాడు.

ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి అద్బుతంగా తీర్చిదిద్దాడని కరణ్ చెప్పుకొస్తున్నాడు. మరి ఇంతలా ఈ దర్శకుడు రాజమౌళిని, బాహుబలిని పొగిడేయడానికి కారణం ఏమిటో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఈ సినిమాను భారతీయులు గర్వించదగ్గ సినిమా అని కరణ్ పొడిగేయడానికి కారణం కూడా చాలా మందికి తెలిసిందే. ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తున్నది ఈ దర్శకనిర్మాతే! 

హిందీ వెర్షన్ ను విడుదల చే్స్తున్న ఈయన.. ఆ సినిమాపై అందరి అటెన్షన్ ను తీసుకురావడానికి ఇలా పొగుడుతున్నాడు. తను విడుదల చేస్తున్న సినిమాకు ఓపెనింగ్స్ రాబట్టుకోవడానికి ఇలా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ విషయంలో ఆయన ఏ మేరకు విజయవంతం అవుతాడో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -