Thursday, May 16, 2024
- Advertisement -

ఈ హీరోయిన్ ను అత్తగారే సెక్సీగా కనిపించమంటున్నారట!

- Advertisement -

మామూలుగా కోడళ్లను అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నించే అత్తగార్లు ఉంటారు. రాచి రంపాన పెట్టే వాళ్లూ ఉంటారు. ఇంటి గడప దాటకూడదని.. కొడుకు చెప్పినట్టుగా నడుచుకోవాలని సూచించే వాళ్లూ ఉంటారు. కొంత లిబరల్ గా ఉండే వాళ్లూ ఉంటారు. అయితే కరీనా కపూర్ కు మాత్రం చాలా మంచి అత్తగారు కనిపించింది. ఈ హీరోయిన్ ప్రొఫెషన్ కు తగ్గట్టుగా నడుచుకోవడం పట్ల ఆ అత్తగారు అభ్యంతరం చెప్పడం లేదు.

పై పెచ్చూ సూచనలు ఇస్తూ.. సెక్సీ గా కనిపించడం మీద ఆమె గైడెన్స్ ఇస్తోందట. అందంగా, సెక్సీగా కనిపించాలని సూచనలు ఇస్తూ ఎంకరేజ చేస్తోందట. ఈ విషయాన్ని కరీనానే చెప్పుకొచ్చింది. తన భర్త సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ గురించి కరీనా వివరించింది. ఆమె చాలా మంచిదని.. తన కెరీర్ ను ప్రోత్సహిస్తోందని.. సెక్సీగా కనిపించమని తనను ప్రోత్సహిస్తోందని కరీనా చెప్పించింది.

ఈ విధంగా పెళ్లి అయ్యాకా తన ఇంట్లో వాళ్ల నుంచి ప్రోత్సాహం లభిస్తోందని కరీనా వివరించింది. మరి షర్మిల కూడా ఒకప్పుడు హీరోయినే..పెళ్లి అయ్యాకా కూడా సినిమాలు చేసింది. కాబట్టి.. ఇప్పుడు ఆమె కరీనా కెరీర్ ను ప్రోత్సహిస్తూ ఉండవచ్చు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -