Tuesday, May 21, 2024
- Advertisement -

బ‌జార్‌ మ్యాగ‌జైన్‌కు క‌రీనా ఫొటోషూట్‌

- Advertisement -

పెళ్ల‌యి పిల్లాడు పుట్టిన ఆ అందం త‌ర‌గ‌లేదు. ఆంటీగా మారిన అందానికి కొద‌వ లేద‌ని క‌రీనా క‌పూర్ నిరూపిస్తోంది. ఆమె పెళ్లి చేసుకొని దాదాపు రెండేళ్ల‌వుతోంది. పెళ్లికి ముందు వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్న పొడుగు కాళ్ల సుంద‌రి పెళ్లి త‌ర్వాత కొద్దిగా సినిమాల‌కు గ్యాప్ తీసుకుంది. సైఫ్ అలీఖాన్‌తో పెళ్లి అనంత‌రం గ‌ర్భ‌వ‌తిగా ఉండి కొన్ని షోల‌లో క్యాట్‌వాక్ చేసి అల‌రించింది. భ‌ర్త‌తో క‌లిసి ప‌లు ఈవెంట్ల‌కు హాజ‌రైంది. పిల్లాడు పుట్టిన త‌ర్వాత కొంచెం ఇంటికి ప‌రిమిత‌మైన ఆమె ఇప్పుడు ఓ మ్యాగ‌జైన్ ఇచ్చిన ఫొటోషూట్ చూస్తే షాక్కావ‌ల్సిందే.

ఏమా అందం.. కొంచెం కూడా త‌గ్గ‌లే అనిపిస్తోంది. ఇప్ప‌టికీ కుర్రాళ్ల హీట్ పెంచే అందం ఆమె సొంతం. బ‌జార్ అనే మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం త‌న అందాల‌న్నీ చూపించేసింది. మొహ‌మాట‌మే లేకుండా గ్లామ‌ర్‌నంతా ఒల‌క‌బోసింది. క‌రీనా ఈ స్థాయిలో ఫోజులివ్వ‌డం మొద‌టిసారిగా చెప్పొచ్చు. ఈ మ‌ధ్యే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రీనా.. మ‌ళ్లీ జిమ్‌కు వెళ్లి 20 కిలోల బ‌రువు త‌గ్గి నాజూగ్గా మారిపోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

ఇక తాను సినిమాల‌కు ఇంకా ప‌నికొస్తాన‌ని.. అందాలు ఆర‌బోయ‌డానికి సిద్ధ‌మ‌ని ఈ ఫొటో షూట్ ద్వారా చెప్ప‌క‌నే చెబుతోంది ఈ `అమ్మ‌`డు.

https://www.youtube.com/watch?v=v1EmSCQJnGs

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -