Thursday, May 16, 2024
- Advertisement -

కార్తీ ‘దేవ్’ టీజ‌ర్ ….కొత్త‌గా ఉందే..!

- Advertisement -

ఖాకి,చిన‌బాబు సినిమాల‌తో హిట్ కొట్టి మంచి జోష్‌లో ఉన్నాడు త‌మిళ హీరో కార్తీ. కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.అత‌ను న‌టించిన సినిమాలు తెలుగులో కూడా విడుద‌ల చేస్తుంటారు.కార్తీ తాజాగా న‌టించిన దేవ్ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఛేజింగ్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు.

కార్తీ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలవుతోంది. “ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి .. ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి .. ఇష్టం లేని ఉద్యోగం చేసి .. ముక్కు మొహం తెలియని ఒక నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పడి పనిచేసి .. ఈగో .. ప్రెషర్ .. కాంపిటేషన్లో ఇరుక్కుని .. అంటీ అంటనట్టు లవ్ చేసి .. ఏం జరుగుతుందో అర్థం కాకుండా బతకడం ఒకదారి. ఇంకోదారి వుంది ..” అంటూ తనకి నచ్చిన మార్గంలో కార్తీ దూసుకెళ్లడం ఈ టీజర్లో చూపించారు. ఖాకి సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రజత్ రవిశంకర్ దేవ్ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.సినిమాను తెలుగు భాష‌ల‌లో ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -