Monday, April 29, 2024
- Advertisement -

ఈ రావణుడికి మాత్రం వంద తలలు‘సుల్తాన్’ ట్రైలర్ అదుర్స్!

- Advertisement -

బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో తమిళ స్టార్ నటుడు కార్తీ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌ ‘సుల్తాన్‌’.  ఈ సినిమాను డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌.ప్రకాశ్‌బాబు, య‌స్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు.  హీరో కార్తీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.  వంద‌ మంది రౌడీల‌ను లీడ్‌ చేసే సుల్తాన్‌గా కార్తి క‌నిపిస్తున్నాడు. వాళ్లను తన అన్నలుగా చెబుతాడు.

సుల్తాన్ లో కార్తీ, ర‌ష్మిక మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకునేలా క‌నిపిస్తున్నాయి. అది ఒక ఏనుగు గుంపు అంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో సుల్తాన్ ట్రయిలర్ ప్రారంభమైంది. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు రొమాంటిక్ అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ట్రయిలర్ లో కార్తి, క్లాస్-మాస్ గెటప్స్ లో కనిపించి ఎట్రాక్ట్ చేస్తున్నాడు. 

 ‘వందమంది రౌడీలను మేనేజ్‌ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది..’ అంటూ కార్తీ చెప్పే డైలాగులు బాగున్నాయి. వివేక్ మెర్విన్ నేపథ్య సంగీతం, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ట్రయిలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను వరంగల్ శ్రీను దక్కించుకున్నారు. ఏప్రిల్ 2న థియేటర్లలోకి రాబోతోంది సుల్తాన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -