Thursday, April 25, 2024
- Advertisement -

నయనతార కు నిశ్చితార్థం జరిగిందా?

- Advertisement -

కోలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ అంటే ఠ‌క్కున గుర్తొచ్చేది న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్ జంట‌. 2015లో వచ్చిన ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా స‌మ‌యంలో న‌య‌న్‌, విఘ్నేష్‌లు ప్రేమ‌లో ప‌డ‌గా, అప్ప‌టి నుండి వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉన్నారు.  గతేడాది లాక్ డౌన్ టైమ్ లో పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా, కనీసం నిశ్చితార్థమైనా పూర్తవుతుందని భావించారు. కానీ ఈ జంట ఏదీ తేల్చలేదు.

కాకపోతే ఖాళీ స‌మ‌యాల‌లో చెట్టాప‌ట్టాలు వేయ‌డం, పండుగుల‌, పార్టీలు క‌లిసి సెల‌బ్రేట్ చేసుకోవ‌డం, ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం వంటివి చేస్తూ వ‌స్తున్నారు. ఇదిలా ఉంటే..విఘ్నేష్ శివన్  ఓ ఫొటో పోస్ట్ చేశాడు. కేవలం నయనతార చేతికి ఉన్న ఉంగరం కనిపించేలా ఆ ఫోటో ఉంది.

తామిద్దరికి ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే అర్థం వచ్చేలా ఈ ఫొటో పెట్టాడు విఘ్నేష్. ఈ జంట అతి త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌డం కూడా ఖాయం అని చెబుతున్నారు. విఘ్నేశ్‌ ప్రస్తుతం కాతువాక్కుల రెండు కాదల్‌ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

వారంలో నాలుగు రోజుల పాటు టీకాల పంపిణీ : సీఎం జగన్

సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రామ్ చరణ్!

ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -