Thursday, May 9, 2024
- Advertisement -

హిందీ లో దున్నేస్తున్న “కార్తికేయ 2 “.. షాక్ లో అమీర్, అక్షయ్ !

- Advertisement -

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం ” కార్తికేయ 2 “. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ” కార్తికేయ ” మూవీకి సిక్వల్ కావడంతో ” కార్తికేయ 2 ” పై ముందు నుంచే అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ రిలీజ్ అయిన తరువాత అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఈ మూవీ హిందీలో రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతూ అక్కడి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

బాలీవుడ్ లో టాప్ హీరోలైన అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ మూవీస్ థియేటర్స్ లో ఉండడంతో తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ” కార్తికేయ 2 ” ఊహించని విధంగా అక్కడి ప్రేక్షకులు ఈ మూవికి బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో థియేటర్స్ విపరీతంగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఎలా ఉందంటే.. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ మూవీస్ ను కూడా తీసేసి కార్తికేయ కోసం థియేటర్స్ కేటాయిస్తున్నారంటే.. ఈ సినిమాను నార్త్ ఆడియన్స్ ఎంతలా అదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇక బాలీవుడ్ లో తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మొదటిరోజు కేవలం 7 లక్షల వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆ తరువాత హిట్ టాక్ తో జట్ స్పీడ్ కలెక్షన్లు రాబడుతోంది. ఆదివారం 28 లక్షలూ, సోమవారం 1.10 కోట్లు, మంగళవారం 1.28 కోట్లు, బుధవారం 1.38 కోట్లు, గురువారం 1.64 కోట్లు.. ఇలా రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ కొనసాగిస్తున్న జోష్ చూస్తుంటే ఫుల్ రన్ లో 20 కోట్ల మేర వసూళ్లు ఒక్క హిందీ లోనే రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తెలుగు నుంచి వచ్చిన ” కార్తికేయ 2 ” తో మరోసారి బాలీవుడ్ లో తెలుగు మూవీ సత్తా చాటిండానే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -