Thursday, April 25, 2024
- Advertisement -

యూట్యూబ్ లో వెంటనే ఈ సెట్టింగ్స్ చేసుకోండి..!

- Advertisement -

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరికి మొబైల్ లో యూట్యూబ్ అప్లికేషన్ కచ్చితంగా ఉంటుంది. గూగుల్ యాప్స్ ద్వారా మొబైల్ లో ఇన్ బిల్ట్ గా ఉన్న యూట్యూబ్ నూ ఆన్ ఇన్స్టాల్ చేయడం కూడా సాధ్యం కాదు. అందువల్ల పిల్లల నుంచి పెద్దల దాకా యూట్యూబ్ లో వీడియోస్ చూడడానికి బాగా అలవాటుపడ్డారు. ఇక యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఉన్న చోటనే ఉంటూ ఎంతో ఇన్ఫర్మేషన్ నెరుచుకుంటూ ఉంటారు చాలామంది. అయితే యూట్యూబ్ సాధారణంగా చూస్తూ ఉంటారు గాని ఉన్న సీక్రెట్ సెట్టింగ్స్ గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి అందరికీ ఉపయోగపడే యూట్యూబ్ లోని కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం !

1.డేటా సేవర్
యూట్యూబ్ ఎక్కువగా చూసేవారు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య మొబైల్ డేటా త్వరగా అయిపోవడం. హై క్వాలిటీలో అధికంగా వీడియోస్ చూడడం వల్ల మొబైల్ డేటా చాలా త్వరగా అయిపోతు ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ లో ఉన్న డేటా సేవర్ ఆప్షన్ ద్వారా హై క్వాలిటీలో వీడియోస్ చూసినప్పటికి డేటాను కొంతమేర సేవ్ చేసుకోవచ్చు

  • ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేసిన తరువాత ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి
  • ఆ తరువాత సెట్టింగ్స్ లోకి వెళ్ళి డేటా సేవర్ ఆప్షన్ ఆన్ చేయాలి
  • అక్కడ రెడ్యూస్ వీడియో క్వాలిటీ, రెడ్యూస్ డౌన్ లోడ్ క్వాలిటీ అనే రెండు ఆప్షన్స్ ను ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డేటా సేవర్ ఆన్ చేసినప్పటికీ వీడియో క్వాలిటీలోనే ప్లే అవుతుంది.

2.సెట్ స్లీప్ టైమర్
మొబైల్ లో యూట్యూబ్ చూస్తూ చాలా మంది అలాగే నిద్రపోతూ ఉంటారు. అలాంటప్పుడు డేటా అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా యూట్యూబ్ లో ఒక మంచి ఆప్షన్ ఉంటుంది.

  • ముందుగా యూట్యూబ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి
  • అక్కడ జనరల్ ఆప్షన్ ఎంచుకోవాలి
  • అక్కడ మొదటి ఆప్షన్ ” remind me take a break ” ఆప్షన్ ఆన్ చేసి మనం నిద్రపోయే టైమ్ సెట్ చేయాలి.
    ఇలా చేయడం వల్ల ఒకవేళ మనం యూట్యూబ్ చూస్తూ నిద్రపోయినప్పుడు ఆటోమాటిక్ గా యూట్యూబ్ క్లోజ్ అయిపోతుంది.

3.హోమ్ స్క్రీన్ వీడియోస్ ప్లే
సాధారణంగా యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు వీడియోస్ ను మనం ఓపెన్ చేయకుండానే హోమ్ స్క్రీన్ పైనే ప్లే అవుతూ ఉంటాయి. ఇలా ప్లే అవ్వడం వల్ల డేటా త్వరగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి అది ఎలా ఆఫ్ చేసుకోవాలో చూద్దాం

  • ముందుగా యూట్యూబ్ సెట్టింగ్ ఓపెన్ చేయాలి
  • అక్కడ జనరల్ ఆప్షన్ ఎంచుకోవాలి
  • జనరల్ లో ” ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్ ఆప్షన్ ” ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యూట్యూబ్ వీడియోస్ హోమ్ స్క్రీన్ పైన ప్లే అవ్వడం ఆగిపోతుంది.

Also Read : మొబైల్ కు రాత్రంతా చార్జింగ్ పెడుతున్నారా.. జాగ్రత్త !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -