తమిళనాడులో భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.హీరో విశాల్‌కు ‘ఇరుంబు తిరై లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మిత్రన్ ఈ భారీ మల్టీస్టారర్‌కు ప్లాన్ చేస్తున్నాడు. ‘ఇరుంబు తిరై సినిమాతో దర్శకుడిగా మిత్రన్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన మరో కథను సిద్ధం చేసి విశాల్‌కు వినిపించాడని తెలుస్తుంది. అయితే ఈ కథ కార్తీకి బాగా సెట్ అవుతుందనే ఉద్దేశంతో మిత్రన్‌ను ఆయన దగ్గరకు పంపించాడట.
ఆ కథ కార్తీకి తెగ నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. అయితే కథలో ఓ ముఖ్యమైన పాత్రను విశాల్ చేయవలసిందేనని కార్తీ అనడంతో అందుకు ఆయన అంగీకరించాడని సమాచారం.అంటే ఒకే సినిమాలో విశాల్, కార్తీని చూడబోతున్నారు వారి అభిమానులు. విశాల్, కార్తీ ఇద్దరికి తెలుగులో మంచి మార్కెట్ ఉండటంతో సినిమాను తెలుగు,తమిళ్ భాషలలో రిలీజ్ చేయలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.