టాలీవుడ్‌కి కొత్త ఏడాది తొలిరోజే షాక్ తగిలింది. టాలీవుడ్ కు లీకేజీ అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే కొత్త సంవత్సరం రోజునే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ లేటేస్ట్ సినిమా కాటమరాయుడు సినిమా లీక్ అయ్యి పెద్ద షాక్ ఇచ్చింది. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాల..గోపాల దర్శకుడు డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
2017 ఏడాది మొదటి రోజు కాటమరాయుడుకు సంబంధించి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ సీన్లు లీక్ కావడంతో పవన్ సైతం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పవన్ అత్తారింటికి దారేది సినిమా ఫస్టాఫ్ మొత్తం యూట్యూబ్‌లో లీక్ అయిపోయింది.
ఆ చిత్రం తర్వాత విడుద్ల అయ్యి పవన్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇక అత్తారింటికి దారేది తర్వాత బాహుబలికి సైతం అలాగే దెబ్బపడింది. ఇక కొద్ది రోజుల క్రితం బాహుబలి-2 సైతం లీక్ అవ్వడం పెద్ద సంచలనమైంది. తర్వాత ఆ లీక్‌కు కారణమైన వ్యక్తులను అరెస్టు కూడా చేశారు. ఇక ఇప్పుడు కొత్త యేడాదిలోకి అలా ఎంట్రీ ఇచ్చామో లేదో..తొలి రోజే టాలీవుడ్‌కు కాటమరాయుడు లీక్ మ్యాటర్ షాక్ ఇచ్చింది. ఇక పవన్ అభిమానులు అయితే ఈ లీక్ సెంటిమెంట్ తమకు కలిసొస్తుందని అంటున్నారు. ఇక న్యూ ఇయర్ కానుకగా కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయ్యి…యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది.
Related