Saturday, May 18, 2024
- Advertisement -

2016లో ప‌వ‌న్, మ‌హేష్‌ లకు ఘోర అవ‌మానం

- Advertisement -
pawan mahesh humiliation

2016.. టాలీవుడ్ కు ఎన్నో మంచి విజయాలనందించింది. అయితే ఒకేసారి రెండు చిత్రాలు వస్తే కలెక్షన్స్ రావన్న మాటను టాలీవుడ్ 2016లో చిత్తు చేసి చూపిచింది. ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ఈ ఏడాది టాలీవుడ్ సినిమాల సక్సెస్ రేట్ కూడా బాగా పెరిగింది. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ తమ ఖాతాలో మంచి హీట్స్ వేసుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు హిట్లు కొడితే, అల్లు అర్జున్ స‌రైనోడుతో మంచి హిట్ అందుకున్నాడు.

నాని అయితే ఏకంగా మూడు హిట్స్ అందుకున్నాడు. ఇలా అందరి హీరోలకు హిట్స్ వస్తే ఇద్దరు పెద్ద హీరోలు అయిన పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లకు మాత్రం ఈ ఏడాది దారుణమైన అనుభవాల్ని మిగిల్చింది. ఈ ఇద్దరు హీరో అభిమానులకు 2016 మరిచిపోవాల్సిన ఏడాది. కానీ అంత సులువగా మరిచిపోలేరు. మహేష్ బాబు కెరీర్లో బ్రహ్మోత్సవం చిత్రం మరిచిపోలేని చేదు జ్నాపకం. అందరికి ప్లాప్‍లు వస్తాయి.. అయితే బ్ర‌హ్మోత్స‌వం ప్లాప్‌ను మ‌హేష్‌తో పాటు మిగిలిన హీరోల అభిమానులు కూడా ఓ ఆటాడేసుకున్నారు. ఈ సినిమాని చూసి తిట్టుకోని ప్రేక్షకుడు లేడు.

మహేష్ సినిమా మొదటి షో తర్వాత జనాలు లేని చిత్రంగా ఇది రికార్డులకు ఎక్కింది. ఇక బ్ర‌హ్మోత్స‌వం సినిమాతో పోలిస్తే.. బెట‌రే అయినా ప‌వ‌న్‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ కూడా చేదు జ్ఞాప‌కంలా మిగిలింది. చాలా కాలం తర్వాత పవన్ సో లో గా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. వంద కోట్ల వరకు బిజినేస్ చేసిన ఈ సినిమా సగం మాత్రమే వెనక్కి తెచ్చుకోగలిగింది.ఇలా ఈ స్టార్ హీరోల సినిమాలును ప్రేక్ష‌కులు దారుణంగా తిప్పికొట్ట‌డంతో పాటు మహేష్, పవన్ లకు ఘోర అవ‌మానం మిగిలింది. 

Related

  1. నెట్లో ప‌విత్ర ఆంటీ వీడియోలు!
  2. ప‌వ‌న్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సునీల్!
  3. లీకైన మహేష్ సినిమా కథ ఇదే!
  4. మహేష్ బాబు భార్య లైఫ్ సీక్రెట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -