Saturday, May 18, 2024
- Advertisement -

ప‌వ‌న్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సునీల్!

- Advertisement -

తెలుగు ప్రజలు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ రాజ‌కీయంగా ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందా అని చాలా ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. పవర్ స్టార్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందే పార్టీ స్థాపించినా ఆ ఎన్నిక‌ల్లో మాత్రం పోటీ చేయలేదు. కానీ టీడీపీ-బీజేపీ లకు మాత్రం పవన్ స‌పోర్ట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పడంతో రాజ‌కీయంగా అందరిలో ఆస‌క్తితో నెలకొంది. ముఖ్యంగా ఏపీలో జ‌న‌సేన వేడి చాలా ఎక్కువగా ఉంది.

జ‌న‌సేన అభిమానులు, ఆయ‌న పార్టీలో చేరాల‌నుకుంటున్న వారు ప‌వ‌న్ ఎప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్‌లోకి వ‌స్తాడా అని వెయిట్ చేస్తున్నారు. ప‌వ‌న్ మాత్రం ఇంకాస్త టైం తీసుకునేలా క‌నిపిస్తున్నాడు. ప‌వ‌న్ రాజ‌కీయంగా ఇంకా ఫుల్ టైం బ‌రిలోకి దిగ‌క‌పోయినా ఆయ‌న అభిమానులు మాత్రం చాప‌కింద నీరులా త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల తిరుప‌తిలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు స‌ర్వ‌స‌భ్య స‌మావేశం కూడా పెట్టుకుని త‌మ నేత లేకున్నా తామే పార్టీని న‌డిపించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

అయితే జ‌న‌సేన ఎన్నిక‌ల్లో పోటీ చేయాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే ప్ర‌ముఖ క‌మెడియ‌న్ కం హీరో సునీల్ మాత్రం జ‌న‌సేన పార్టీలో చేర‌న‌ని ఓపెన్‌గా చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చాడు. తాజా ఇంట‌ర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ పవర్ స్టార్ అంటే ఇష్టమని, కానీ  జ‌న‌సేన‌లో చేర‌ను అని, ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌న‌ని ఖ‌రాఖండీగా చెప్పాడు. పవన్ తనకు ఏ పని చేప్పిన చేస్తాను కానీ జ‌న‌సేన లో మాత్రం చేరను అని చెప్పేశాడు. దీనిని బ‌ట్టి సునీల్‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేద‌ని తెలుస్తోంది.

Related

  1. స్టార్ డైరెక్టర్ తో రాత్రంతా గడిపిన హాట్ యాంకర్!
  2. “మెగా స్టార్ గారూ నన్ను క్షమించండి”
  3. స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్లు ఇవే!
  4. మరోసారి గట్టి పోటికి పవర్ స్టార్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -