Friday, April 19, 2024
- Advertisement -

చెన్నై లో కాటమరాయుడు క్రేజ్ మామూలుగా లేదు ..

- Advertisement -
Katamarayudu box-office Collections in Chennai

తమిళ హీరోలకి తెలుగు లో క్రేజ్ బాగానే ఉంటుంది. మాస్ సినిమాల టైం లో ఇక చెప్పక్కర్లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి తమిళం లో సినిమా విడుదల అప్పుడు ఎంత హడావిడి ఉంటుందో తెలుగులో కూడా అంతే హడావిడి ఉంటుంది.

కమల్ సినిమా అనగానే క్రిటిక్ లు ఎవ్వరూ మిస్ అవకుండా వెళతారు. కొత్త హీరోలలో సూర్యా కి ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. కానీ మన తెలుగు హీరోలకి మాత్రం తమిళం లో పెద్ద ఫాలోయింగ్ కానీ క్రేజ్ గానీ ఉన్నట్టు కనపడదు. 

తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ హాట్ కేక్ హీరో అయిన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు తో తమిళనాట కూడా స్ట్రాంగ్ గా పాగా వేసినట్టు కనిపిస్తున్నాడు. ముఖ్యంగా చెన్నయి లో మనోడి క్రేజ్ చూసి జనం నోరెళ్ళ బెడుతున్నారు. పవన్ కి అక్కడ ఇంత సీన్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు అందరూ. తెలుగు అగ్ర హీరోలు సినిమాలు అన్నీ చెన్నయి లో విడుదల అవుతాయి కానీ అంత విపరీతమైన క్రేజ్ అయితే ఉండదు. ఈ సినిమా తమిళ చిత్రం వీరం రీమేక్ కావడం తో అక్కడ జనాలకి హైప్ ఏర్పడింది. నిన్న అంటే విడుదల కాబట్టి అనుకోవచ్చు ఇవాళ నుంచీ ఎల్లుండి సాయంత్రం వరకూ అంటే సోమవారం సాయంత్రం వరకూ అడ్వాన్స్ బుకింగ్ లు చెన్నయి లో బుక్ అయిపోయాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -