Saturday, May 4, 2024
- Advertisement -

రాముడిపై కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

- Advertisement -

సినీ రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన శ్రీరాముడిపై అసభ్యక్రమైన పోస్టులు పెట్టారు. దాంతో హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ ని అరెస్ట్ చేశారు. కత్తి మహేష్ తన ఫేస్ బుక్ లో ’రాముడు కరోనా ప్రియుడు’ అంటూ పోస్ట్ పెట్టడంతో.. పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి.

వీటిపై వెంటనే స్పందించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 154 కమ్యూనల్ యాక్ట్ ‌కింద కత్తి మహేష్‌పై కేసు నమోదు చేశారు. అయితే రాముడిపై కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2018లో రాముడుపై ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో.. ఆయనను నగర బహిష్కరణ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరబాద్ రాకూడదని ఆదేశాలు జారీచేశారు.

పలు హిందూ ధార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో పాటు.. శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ యాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టారు. అయితే అప్పుడు పరిపూర్ణానంద పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే ఇంత వివాదం రేగినా.. మళ్లీ కత్తి శ్రీరాముడిపై అసభ్యకర పోస్టులు పెట్టి హిందువులు మనోభావాలు దెబ్బతినేలా చేశాడు.

ఘనంగా జరిగిన నిహారిక నిశ్చితార్థం.. అల్లుడిపై నాగబాబు కామెంట్..!

వరల్డ్ రికార్డ్ సృష్టించిన మహేష్ బర్త్ డే ట్రెండ్

ఛాన్స్ ఇస్తానని పిలిచి.. రూంలోకి తీసుకెళ్లాడు : ఫన్ బకెట్ భార్గవి

‘ఛీ దరిద్రుడా.. తూ’ అని సుధీర్ పరువు తీసిన రష్మీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -