Thursday, May 2, 2024
- Advertisement -

జగన్ కు షాక్.. రాజధాని అమరావతిలో మార్పు లేదు..!

- Advertisement -

ఏపీ రాష్ట్రంలో రాజకీయం అనేక మార్పులకు దారి తీస్తోంది. గవర్నర్ నుండి ఆమోదం వచ్చిన తర్వాత కూడా ఏపీ రాజధాని మార్పు సమస్య పరిష్కారం కాలేదు. దాంతో ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం అన్నది ప్రశ్నగా మారింది. ఒక నిర్ణయంలో ఎలాంటి పక్షపాతం లేకుంటే అది అమలు కావడానికి ఎంతో టైం పట్టదు.

ప్రస్తుతం ఏపీ మూడు రాజధానులు విషయం న్యాయ చిక్కుల్లో ఇరుకుంది. ఈ అంశం తాజాగా విచారణకు వచ్చి జగన్కు హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే.. ఏపీ రాజధాని తరలింపు పై ‘స్టేటస్ కో’ ఇచ్చిన హైకోర్టు ఈ నెల 27 వరకు దానిని పొడిగించి ఏపీ సర్కార్ ను రాజధాని మార్పు అత్యవసరతను మరోసారి సమీక్షించుకోమని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. అయితే స్టేటస్ కో పొడిగించవద్దని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరిన.. అందుకు కోర్టు ఒప్పుకోకుండా స్టేటస్ కో ను పొడిగించింది.

దాంతో జగన్ సర్కార్ కు ఉహించని దెబ్బ తగిలినట్లు అయింది. అయితే ఈ కరోనా టైంలో రాజధానీ మార్చాల్సిన అంత అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ను ఆగస్టు 27కు వాయిదా వేసింది. ఈ విచారణ పూర్తయ్యే సరికి కనీసం మరో రెండు నెలలు అయిన పట్టేలా ఉంది. అప్పటివరకు జగన్ రాజధానిని అమరావతి నుండి తరలించే ఛాన్స్ లేదు. ప్రస్తుతానికి రాజధానిపై యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశాలు జారి చేసింది. మరి జగన్ సర్కార్ కోర్టు వారి ఆదేశాలను పాటిస్తారో.. లేక మరే నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై కేసు నమోదు..!

అన్ని రెడ్లకేనా.. ప్రజలు ఊరుకోరు : ఎంపీ రఘురామ

ఆదినారాయణ రెడ్డికి హైకోర్ట్ షాక్.. జగన్ సర్కార్ నిర్ణయం కరెక్ట్..!

చంద్రబాబు కాల్ చేస్తే.. బ్లాక్ చేసిన టీడీపీ లీడర్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -