చికెన్ వింగ్స్‌లో కరోనా వైరస్ ను గుర్తించినట్లు చైనా చేసిన ప్రకటన సంచలనం రేపింది. బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న చికెన్ వింగ్స్‌లో కరోనా ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఆహారం ద్వారా కానీ ప్యాకేజింగ్ ద్వారా కరోనా సోకుతుందని చెప్పడానికి ఆధారల్లేవని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
ఆహారం ద్వారా కరోనా వస్తుందని ప్రజలు భయపడొద్దని ప్రజలకు సూచించింది. “ఆహారం ద్వారా కరోనా సోకదని.. ప్రజలు భయపడద్దని.. ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ లేదా డెలివరీ గురించి జనం ఆందోళన చెందొద్దు’’ అని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్ ప్రొగ్రాం హెడ్ మైక్ ర్యాన్ తెలిపారు. చైనా లక్షలాది ఫుడ్ ప్యాకేజీలను టెస్ట్ చేయగా.. కేవలం పదిలోపు ప్యాకేజీల్లోనే వైరస్ ను గుర్తించారని డబ్ల్యూహెచ్‌వో ఎపిడమియోలజిస్ట్ మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. చైనాకు భారీ ఎత్తున బ్రెజిల్, ఈక్వెడార్ తదితర దేశాల నుంచి మాంసం ఉత్పత్తులు దిగుమతి జరుగుతున్నాయి. బ్రెజిల్ నుండి వచ్చిన చికెన్ వింగ్స్‌లో కరోనా ఆనవాళ్లను గుర్తించామని చైనా ప్రకటించింది.
ఈక్వెడార్ నుంచి వచ్చిన రొయ్యల్లోనూ వైరస్ ఉందని తెలిపింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు భయపడ్డాయి. ఈ విషయమై బ్రెజిల్ స్పందించింది. చైనా కనుగొన్న కరోనా ఆనవాళ్ల గురించి వివరణ కోరుతున్నామని బ్రెజిల్ వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈక్వెడార్ ప్రొడక్షన్ మినిస్టర్ మాట్లాడుతూ.. తమ దేశం చాలా కఠినమైన నియామాలను పాటిస్తున్నామని.. తమ దేశం దాటి వెళ్లిన తర్వాత ఏమవుతుందన్నది తమ బాధ్యత కాదని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై బాబు శీతకన్ను
కరోనా పై మోడి కి కేసీఆర్ సూచనలు
