Saturday, May 18, 2024
- Advertisement -

చంద్రబాబుతో స‌హా 8 మందికి హైకోర్టు నోటీసులు..

- Advertisement -

జ‌గ‌న్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. ధ‌ర్డ్ పార్టీతో విచార‌ణ జ‌రిపించాల‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ హైకోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెల‌సిందే. విచార‌ణలో హైకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణా డీజీపీ, ఏపీ డీజీపీతో స‌హా 8 మందికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది.

జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించిన పిటీషన్‌పై హైకోర్టులో వాదనలు సుధీర్ఘంగా వాద‌న‌లు కొన‌సాగాయి. సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ బీవీఎస్‌ నాగేశ్వరరావు, మరికొంతమంది అధికారులు మంగళవారం కేసు వివరాలను సీల్డ్‌కవర్‌లో ఉన్నత న్యాయస్థానానికి సమర్పించారు.

సీసీ టీవీ ఫుటేజ్‌ వివరాలను ఏమయ్యాయని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. గత మూడు నెలలుగా సీసీ టీవీ ఫుటేజ్‌ లేదని అధికారులు తెలపడంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీసీటీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందనే విషయంపై సిట్‌ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు.

దీనిలో భాగంగా ఇన్విస్టిగేష‌న్ రిపోర్ట్‌ను రెండు వారాల్లోగా సీల్డ్ క‌వ‌ర్‌లో ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది.మ‌రోవైపు విశాఖ ఎయిర్‌పోర్ట్ బ‌ద్ర‌తా లోపాల‌పై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జ‌గ‌న్ రిట్ పిటిష‌న్‌లో పేర్కొన్న వారందిరికీ నోటీల‌సు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించ‌డం రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -