- Advertisement -

వామ్మో కీర్తి సురేష్‌కు అంత డిమాండా..?

- Advertisement -

కీర్తి సురేష్ తెలుగు త‌మిళ భాష‌లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక మ‌హ‌న‌టి సినిమాతో కీర్తికి అవ‌కాశాలు బాగా పెరిగాయి. మ‌హ‌న‌టి సినిమాలో కీర్తి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందాయి. త‌మిళంలో వ‌రస సినిమాలు చేస్తు బిజిగా ఉంది కీర్తి. అయితే కీర్తి ఇప్ప‌డు కొత్త సినిమాలు ఒప్పుకోవ‌డం లేద‌ని స‌మాచారం. ఆమె కోసం ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు వెయింటింగ్ చేస్తున్నారు. ఆమె కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకోవ‌డం లేదంటే.. కీర్తి వ‌ర‌స పెట్టి స్టార్ హీరోల ప‌క్క‌న సినిమాలు చేస్తుంది కీర్తి.

విజయ్, విక్రమ్, విశాల్‌ లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో నటించడానికి అంగీకరించింది. విశాల్‌తో సండైకోళి–2, విక్రమ్‌తో సామి స్క్వేర్‌, విజ‌య్‌తో సర్కార్ సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు పూర్తి చేసిన త‌రువాతే వేరే సినిమాలు ఒప్పుకోవాల‌ని కీర్తి ఆలోచ‌న‌. దీంతో చాలా మంది ద‌ర్శక‌-నిర్మాత‌లు కీర్తి కోసం వెయింటింగ్ చేస్తున్నార‌ని తెలుస్తుంది. దీని బ‌ట్టి చూస్తే కీర్తి డిమాంగ్ ఎంత‌టిలా ఉందో అర్థం చేసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -